Union Cabinet: భారత్‌లో ‘ఎన్‌సీఎంఎం మిషన్’ ఏర్పాటుకు రూ.34,300 కోట్లు

ఏడు సంవత్సరాల్లో రూ.34,300 కోట్ల వ్యయం అంచనాతో ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్(ఎన్‌సీఎంఎం)’కు ఆమోద ముద్ర వేసింది. ఇది దేశంలో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) రంగాన్ని బలోపేతం చేసేందుకు లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.16,300 కోట్లను, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు రూ.18 వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉంది.
ఈ ప్రణాళిక హరిత ఇంధన రంగానికి అనుకూలంగా ఉండి, స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడుతుంది. భారత్‌లోని ఖనిజాల వనరులను అన్వేషించడమే కాకుండా, ఇతర దేశాల్లోని వనరులతో కూడా వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరి 29వ తేదీ జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేశారు.
Railway Station: ఏపీలో.. ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్లు
ఈ మిషన్ ముఖ్య లక్ష్యం.. దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి 24 కీలక ఖనిజాల నిల్వలను దేశంలో వెలికితీసేందుకు ప్రయత్నించడమే. ఈ రంగంలో భారతదేశం స్వావలంబనను సాధించడం, కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వలన, దేశ ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా పనిచేస్తుంది.