Skip to main content

Union Budget 2025: ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. దీనిని ఎప్పుడు ప్రవేశపెడతారు?

భారతదేశంలో ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ముందు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఒక ముఖ్యమైన పత్రం.
What Is The Economic Survey   Finance Minister presenting the Economic Survey in Parliament  Financial report analysis before Budget 2025-26

ఇది జాతీయ ఆర్థిక పరిస్థితిని వివరించే ముఖ్యమైన నివేదికగా పరిగణించబడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1వ తేదీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కానీ బడ్జెట్‌కి ముందు ఆర్థిక సర్వే కూడా ప్రవేశపెడతారు. ఇది జనవరి 31వ తేదీ పార్లమెంట్‌లో సమర్పించబడుతుంది.

ఆర్థిక సర్వే ప్రాముఖ్యతలు ఇవే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై గమనిక: ఇది గత సంవత్సరంలో జరిగిన బడ్జెట్ ప్రభావాలను విశ్లేషించి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను వివరించడమే కాకుండా, ప్రాథమిక, ద్వితీయ, సేవా రంగాలు వంటి మూడు ముఖ్యమైన రంగాల్లో ప్రగతి గురించి వివరాలు అందిస్తుంది.

భవిష్యత్తు అంచనాలు: ఆర్థిక సర్వే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చో కూడా అంచనా వేస్తుంది. దీనిలో భవిష్యత్తులోని ఆర్థిక ధోరణులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఇది వివిధ సామాజిక భాగాలపై ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియజేస్తుంది, అలాగే ఏ రంగాలకు ఎక్కువ శ్రద్ధ అవసరమో, ఏ రంగంలో అభివృద్ధి కావలసిన దిశ ఏమిటో కూడా సూచిస్తుంది.

Union Budget 2025: యూనియన్ బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు ఇవే..

ఆర్థిక సర్వే ఎప్పుడూ ప్రవేశపెడతారు?
ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వే జనవరి 31వ‌ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇది సాధారణంగా బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఉంటుంది. ఈ ఏడాది కూడా బడ్జెట్ ముందు ఆర్థిక సర్వే సమర్పించబడుతుంది.

ఆర్థిక సర్వే ఎవరు తయారు చేస్తారు?
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఈ సర్వే తయారీకి ఆర్థిక వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఆర్థిక విభాగం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రక్రియకు అధిపతి ప్రధాన ఆర్థిక సలహాదారు. ఈ ఏడాది ఈ బాధ్యత వి.అనంత నాగేశ్వరన్ భుజాలపై ఉంటుంది. ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ఆర్థిక సలహాదారు ఆ దస్తావేజును పత్రికలకు అందజేస్తారు. 

ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఇదే..
ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును చెబుతారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే వివ‌రిస్తారు.

Union Budget: కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..

Published date : 30 Jan 2025 03:17PM

Photo Stories