Same-Sex Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అత్యంత సంక్లిష్టం
Sakshi Education
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అత్యంత సంక్లిష్టమైన అంశమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.
వాటికి కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 18న విచారణ మొదలు పెట్టింది. ‘ఈ విషయంలో వ్యక్తిగత వివాహ చట్టాల్లోకి పోదల్చుకోలేదు. కులమతాలతో సంబంధం లేకుండా భిన్న మతాలు, కులాలకు చెందిన వారు పెళ్లి చేసుకునేందుకు చట్టపరమైన వెసులుబాటు కల్పిస్తున్న ప్రత్యేక వివాహ చట్టంపై మాత్రమే విచారణ జరుపుతాం. దానిమీదే వాదనలు విన్పించండి’ అని న్యాయవాదులకు సూచించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణను వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
Same-Sex Marriage: స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
Published date : 19 Apr 2023 05:48PM