Tokay Gecko Lizard: అరిష్టం కాదు.. అదృష్టం.. ఈ బల్లి విలువ రూ.కోటిన్నర
చూడ్డానికి ప్లాస్టిక్ బల్లిగా కనిపిస్తున్న ఇది అంతరిస్తున్న జీవ జాతుల జాబితాలో ఉన్న టోకే గెక్కో రకం బల్లి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ఏకంగా రూ.1.5 కోట్లు పలుకుతోంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో అరుదైన టోకే గెక్కో బల్లి, మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను పోలీసులు నవంబర్ 30న స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతరించిపోయిన తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు.
ప్రపంచలోనే అత్యధిక దూరం వలసపోయే పక్షి ఇదే.. దీని ప్రత్యేకతలు మాత్రం..
టోకే గెక్కో బల్లిని పశ్చిమ బెంగాల్‌లోని కరాండిఘి నుంచి బీహార్‌కు తీసుకెళ్లినట్లు ఏరియా ఎస్‌డిపిఓ ఆదిత్య కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ఇతరాత్ర మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో తక్షకు మంచి డిమాండ్ ఉంది. తక్షక్ అనేక దేశాలలో అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.