PM Modi: గోవా విమోచన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
60వ గోవా విమోచన దినోత్సవ వేడుకలను డిసెంబర్ 19న నిర్వహించారు. గోవా రాజధాని పనాజిలో జరిగిన ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ... ‘‘మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది.’’ అని పేర్కొన్నారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని వివరించారు.
రాయ్ తుపాన్ ఏ దేశంలో సంభవించింది?
ఫిలిప్పీన్స్‌ను డిసెంబర్ 16, 17వ తేదీల్లో అతలాకుతలం చేసిన రాయ్ తుపాను తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరింది. గంటకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ప్రభావం 7.80 లక్షల మంది ప్రజలపై పడిందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తెలిపింది.
చదవండి: గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్