కొత్త CJI నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణంచేస్తారని రిజెజు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదోతేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్‌కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్‌కానున్నారు.
సాధారణంగా సుప్రీంకోర్టు జడ్జి 65 ఏళ్ల వయసురాగానే రిటైర్‌అవుతారు.
Also read: Local Language: కోర్టుల్లో స్థానిక భాష... ఆలిండియా న్యాయ మంత్రుల సదస్సులో మోదీ
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP