Skip to main content

Digital ID's : రైతులకు ఆధార్‌ తరహాలో డిజిటల్‌ ఐడీలు..

దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్‌ తరహాలో డిజిటల్‌ ఐడీలు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్‌ తరహాలో డిజిటల్‌ ఐడీలు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అగ్రిస్టాక్‌ కార్యక్రమంలో భాగంగా రైతులకు అందజేసే సేవలు, పథకాలను క్రమబద్ధం చేసేందుకు డిజిటల్‌ ఐడీలను ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల మందికి, వచ్చే ఆర్థిక సంవత్సరం మూడు కోట్ల మందికి, ఆ తరువాత ఏడాది రెండు కోట్లమందికి డిజిటల్‌ ఐడీలను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Indian Size : త్వరలోనే ‘ఇండియాసైజ్‌’లో దుస్తులు

రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఐడీలను తయారు చేసి, నిర్వహిస్తాయని పేర్కొంది. రైతుల భూమి రికార్డులు, వారి పశు సంపద, పంటల సాగు, వారికి లభించే సదుపాయాలకు ఐడీలను అనుసంధానం చేస్తారని వివరించింది. త్వరలో దేశవ్యాప్తంగా పంటల సర్వేను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాల్లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన జిల్లాల్లో డిజిటల్‌ సర్వే పూర్తిచేస్తామని పేర్కొంది.
Unmanned Bomber : మానవ రహిత బాంబర్‌ విమాన గగన విహారం

Published date : 14 Sep 2024 05:26PM

Photo Stories