Skip to main content

Indian Size : త్వరలోనే ‘ఇండియాసైజ్‌’లో దుస్తులు

Dress sizes to be Indian size very soon

భారత్‌లో త్వరలోనే ‘ఇండియాసైజ్‌’లో దుస్తులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ విషయాన్ని సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పటివరకు భారత్‌లో దుస్తులు అన్నీ యూఎస్‌ లేదా యూకే సైజ్‌లలోనే లభిస్తున్నాయి.

Unmanned Bomber : మానవ రహిత బాంబర్‌ విమాన గగన విహారం

ఈ సమస్యకు ‘ఇండియా సైజ్‌’ ప్రాజెక్టు పరిష్కారం చూపిస్తుందని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. భారతీయుల శరీరాలకు తగ్గట్టుగా కొత్త ప్రామాణిక కొలతలను రూపొందించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా,దుస్తుల డిజైన్‌ల తయారీ కోసం టెక్స్‌టైల్స్‌ శాఖ, ఎన్‌ఐఎఫ్‌టీ కలిసి రూపొందించిన ఏఐ ఆధారిత ‘విజన్‌ నెక్టాస్‌’ పోర్టల్‌ను గిరిరాజ్‌ సింగ్‌ ప్రారంభించారు.

Published date : 14 Sep 2024 05:09PM

Photo Stories