Unmanned Bomber : మానవ రహిత బాంబర్ విమాన గగన విహారం
Sakshi Education
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మానవ రహిత బాంబర్ విమానం ‘ఎఫ్ డబ్ల్యూడీ 200బీ’ తొలిసారిగా విజయవంతంగా గగన విహారం చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ (ఎఫ్ డబ్ల్యూడీఏ) సంస్థ దీన్ని రూపొందించింది. ఇది సుమారు 15వేల అడుగుల ఎత్తులో, ఏడు గంటల పాటు నింగిలోనే ఉండగలదు.
Indian Army : సైనిక దళాలను మరింత బలోపేతానికి రూ.1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లు
ఈ విమానం నిఘా కోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళుతుంది. దీని ఏరోడైనమిక్స్ డిజైన్, ఎయిర్ ఫ్రేమ్, ప్రొపల్షన్, నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్‌ను తమ కర్మాగారంలోనే రూపొందించారు. ఈ విమానం బరువు 102 కిలోలని, గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.
Published date : 16 Sep 2024 10:36AM