Supreme Court: భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర సర్కార్‌లు గతంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తులను నిలిపివేస్తూ కొత్త కమిటీని సుప్రీంకోర్టు కొలువు తీర్చనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత కేసు విచారణ సందర్భంగా జనవరి 10న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కమిటీలో సభ్యులుగా..
చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్ జనరల్, పంజాబ్– హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ దర్యాప్తు కమిటీలో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం పునరావృతం కాకుండా పటిష్ట రక్షణకు సూచనలు ఇచ్చేలా, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలంటూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జనవరి 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు..
GK International Quiz: ఔటర్ స్పేస్ డొమైన్‌లో ఏ దేశ సహకారం కోసం భారత్ అన్వేషిస్తోంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్