India’s Hunger Project: భారత్ హంగర్ ప్రాజెక్ట్‌కు నార్వే మద్దతు
ఉత్తరాఖండ్‌లో మహిళా నాయకులను శక్తివంతంగా తయారు చేయడం, ఆహార భద్రతను మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. మూడేళ్ల వ్యవధిలో సెప్టెంబర్ 2026 వరకు ₹44.7 మిలియన్ల వ్యయంతో రాష్ట్రంలోని అట్టడుగు కుటుంబాలకు సహకారాన్ని అందించనున్నారు.
India, Bangladesh New projects: భారత్,బంగ్లాదేశ్‌ల మధ్య పలు ప్రాజెక్టులకు శ్రీకారం
హంగర్ ప్రాజెక్ట్ ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికైన మహిళా ప్రతినిధులు, సమాఖ్యల సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. సాధికారత పొందిన మహిళా నాయకులు స్థానిక పాలనను బలోపేతం చేయడంలో, సహజ వనరులను పరిరక్షించడంలో, అట్టడుగు కుటుంబాలకు ఆహార భద్రత, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాలు, తొమ్మిది బ్లాక్‌లు, 172 గ్రామ పంచాయతీలు మరియు 145 వన పంచాయతీలలో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది .
India allows non-basmati rice exports: బాస్మతీయేతర బియ్యానికి కేంద్రం అనుమతి