Skip to main content

India allows non-basmati rice exports: బాస్మతీయేతర బియ్యానికి కేంద్రం అనుమతి

బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
White rice trade to seven additional nations, India allows non-basmati rice exports,Non-basmati white rice exports expanded
India allows non-basmati rice exports

నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్, ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

India–Middle East–Europe Corridor: ఆ కారిడార్‌ ప్రపంచ వాణిజ్యానికి అడ్డా

ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియాకు 1,42,000, మలేíÙయాకు 1,70,000, ఫిలిప్పైన్స్‌కు 2,95,000 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్‌ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

Indian Laws in Regional Launguages: స్ధానిక భాషల్లో భారత చట్టాలు

Published date : 20 Oct 2023 12:17PM

Photo Stories