Nomore India...only Bharath: భారత్ ఒక్కటే నోమోర్ ఇండియా...ఒన్లీ భారత్
ఇండియా అంటే భారత్ అని అర్థం. ఇండియా, భారత్ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోడీ ప్రభుత్వం కనిపిస్తోంది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జి–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Bharat Instead of India: ఇకపై ఇండియా కాదు..భారత్ అనాల్సిందే?
నగరాల పేర్లనుంచి ...దేశం పేరు మార్పు వరకు
నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ గా, గుర్గావ్‌ను గురుగ్రామ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి బిజెపి, సంఘ్ పరివార్‌నుంచి వస్తోంది.
India@2047: 2047 నాటికి అభివృద్ధి భారత్
వేద కాలం నుంచే ఈ ప్రాంతానికి భారత్ పేరు..
భారత్‌పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్ అనే పేరు ఉద్భవించిందని చెపుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెపుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే. అలాగే భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగద కు పశ్చిమాన ఉన్నభాగాన్నే భారత్ గా శాసనాలో ఉంది. దక్షిణభారతం, దక్కన్ పీఠభూమి దీని నుంచి మినహాయించారు.
Nehru museum renamed as Prime Minister's museum: ప్రధానమంత్రి మ్యూజియంగా నెహ్రూ మ్యూజియం
గ్రీకుల కాలంలో ఇండియా పేరు
ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్‌లో ఇండస్ రివర్‌గా పిలుస్తుంటారు. ఇండస్ రివర్‌కు అవతల ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్ అనే పిలవడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది.
ఇండియా పేరు ఎలా మారుస్తారంటే ?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్‌గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజారిటీ ఎన్‌డిఎకు లోక్‌సభలో ఉన్నప్పటికీ, రాజ్యసభలో ఇది గట్టెక్కుతుందా అనేది అనుమానమే. ఎన్‌డిఎతో పాటు మిత్రపక్షాలు మద్దుతు ఇస్తే తప్ప బిల్లు పాసయ్యే అవకాశం లేదు. ఒక వేళ లోక్‌సభ, రాజ్యసభ రెండింటిని కలిపి సమావేశపరిచి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. ఒకవైపు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డిఎంకె తీవ్రమైన వాదన వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ బిల్లు గనుక ప్రవేశపెడితే రణరంగంగా మారే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ దీన్ని ఏకమొత్తంగా వ్యతిరేకిస్తాయా లేక ఎవరి దారిలో వారు నిర్ణయాలు తీసుకుంటారా ? అన్నది తేలాలి.
Delhi ordinance bill passed in Lok Sabha: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం
కొత్త పార్లమెంటులో నూతన చరిత్ర: ఇండియా టు భారత్
నూతనంగా నిర్మించిన పార్లమెంటులో దేశం పేరు మార్చే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్త చరిత్రను సృష్టిస్తుందని అంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన అమృత్ కాల్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ భారత్ గా మారి నూతన చరిత్రకు నాంది పలుకుతుందనే వాదన వినిపిస్తోంది. ఇండియా పేరు మార్పు ద్వారా వలసవాద చిహ్నల తొలగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ తిరుగులేని ఖ్యాతి గడిస్తారని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా భారత్ వర్సెస్ ఇండియా కూటమికి మధ్య పోరాటానికి ఇదే భూమికగా ఉంటుందని అంటున్నారు. హిందుత్వ ఎజెండాపై రాజకీయాలు చేస్తున్న బిజెపికి ఎన్నికల సమయంలో ఇదొక తిరుగులేని ఆయుధంగా మారే అవకాశముందా ? లేదా అన్నది కాలమే తేల్చాలి.
PM Vishwakarma: ‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం