Keshavananda Bharati Verdict: 10 భారతీయ భాషల్లో కేశవానంద భారతి తీర్పు
‘కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా ప్రసిద్ధి చెందిన ఈ కేసులో.. రా¬జ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడి ఏప్రిల్ 24, 2023 నాటికి 50 ఏళ్లు పూర్తయింది.
Articl 370: ఆర్టికల్ 370 రద్దును సమర్ధించిన సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌డి.వై.చంద్రచూడ్ ఈ తీర్పు కోసం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఓ పేజీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పు హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ,కన్నడ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉందన్నారు. హిందీని ఉపయోగించే జిల్లా కోర్టులు, న్యాయవాదులు ఇకపై సుప్రీంకోర్టు తీర్పులను హిందీలోనే ప్రస్తావించవచ్చునని తెలిపారు. షెడ్యూల్డు భారతీయ భాషలన్నింటిలోకి తీర్పులను అనువదిస్తున్న¬ట్లు చెప్పారు.
రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారాన్ని పరిమితం చేస్తూ.. రాజ్యాంగ ధర్మాసనం 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. కానీ, రాజ్యాంగ మౌలిక స్వ¬రూపాన్ని మార్చే అధికారం లేదని ప్రకటించింది. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అధికారాల విభజన, లౌకికవాదం వంటివి మౌలిక స్వ¬రూపంలో భాగమని.. వాటిని సవరించేందుకు వీ¬లులేదని ఈ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆ భాగాన్ని కొట్టేయలేం