Skip to main content

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఆ భాగాన్ని కొట్టేయలేం

ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళల రిజర్వేషన్‌ బిల్లులో ‘జనగణన అనంతరం అమల్లోకి వస్తుంది’అని పేర్కొంటున్న భాగాన్ని కొట్టేయడం చాలా కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Scale of justice with 'Section Activation Post-Census' noted, Gavel on a table with 'Challenges in Striking Down Bill Section, Supreme Court On Plea Over Women's Reservation Bill, Legal document with 'Women's Reservation Bill' highlighted,

ఈ మేరకు కేంద్రానికి నోటీసులిచ్చేందుకు తిరస్కరించింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో తెచ్చిన మహిళా బిల్లును రానున్న సాధారణ ఎన్నికల్లోపే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Women's Reservation Bill Latest News : ఎట్ట‌కేల‌కు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చట్ట రూపం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర

న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టి దర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. దీన్ని ఈ అంశంపై దాఖలైన మరో పిటిషన్‌తో పాటు నవంబర్‌ 22న విచారిస్తామని పేర్కొంది. లోక్‌సభలోనూ, అసెంబ్లీల్లోనూ మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తూ కేంద్రంలో బీజేపీ సర్కారు సెప్టెంబర్‌ 21న ఈ బిల్లు తేవడం తెలిసిందే. దానికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది. ఇక మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదమే మిగిలింది. ఇది నిజంగా మంచి ముందడుగని ధర్మాసనం అభిప్రాయపడింది.  

Abortion rules and Laws: అబార్షన్‌ల‌పై భిన్నాభిప్రాయాలు

Published date : 06 Nov 2023 09:19AM

Photo Stories