Skip to main content

6G Services: ట్రాయ్‌ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

6G Services

Telecom Regulatory Authority of India (TRAI): 5జీకి మించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందించే 6జీ టెలికం నెట్‌వర్క్‌ను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని  మే 17న న్యూఢిల్లీలో నిర్వహించిన టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?

ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు..

  • దేశీయంగా ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసులు అందుబాటులో ఉండగా త్వరలో వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది.
  • 5జీ నెట్‌వర్క్‌తో దేశీ ఎకానమీకి 450 బిలియన్‌ డాలర్ల మేర ఊతం లభించగలదు.
  • కేవలం ఇంటర్నెట్‌ వేగం పెరగడమే కాదు అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన కూడా వేగం పుంజుకుంటాయి. 
  • వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్‌ వంటి రంగాల వృద్ధికి తోడ్పాటు లభిస్తుంది.

Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?

తొలి 5జీ టెస్ట్‌బెడ్‌ ఆవిష్కరణ..: దేశీయంగా రూపొందించిన తొలి 5జీ టెస్ట్‌బెడ్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ముఖ్యమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో స్వయం సమృద్ధి దిశగా ఇది కీలక అడుగని ఆయన పేర్కొన్నారు.

Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?

టెలికం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం సాధనాలను ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉపయోగించడం ప్రారంభించగలదని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. దేశీ 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.

Supreme Court: ఐపీసీ సెక్షన్‌ 124ఏ దేనికి సంబంధించినది?

ట్రాయ్‌..
ఏర్పాటు:
ఫిబ్రవరి 20, 1997
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ప్రస్తుత చైర్మన్‌: డాక్టర్‌ పీడీ వాఘేలా​​​​​​​

GK Awards Quiz: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022 జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది?​​​​​​​GK National Quiz: 9వ తరగతి నుండి పాఠశాలల్లో భగవత్ గీత బోధించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 May 2022 06:40PM

Photo Stories