Google, Apple under probe for unfair practices: సీసీఐ నివేదిక రాగానే గూగుల్, యాపిల్‌పై చర్యలు
Sakshi Education
అన్యాయమైన వ్యాపార విధానాలు అవలంభిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్, యాపిల్‌పై విచారణ జరుపుతున్నట్టు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్‌పర్సన్ రవ్‌నీత్ కౌర్ తెలిపారు.
స్మార్ట్ టెలివిజన్, అలాగే వార్తల కంటెంట్ విభాగంలో దాని ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందని, అలాగే యాప్ స్టోర్‌కు సంబంధించి వ్యతిరేక పోటీ పద్ధతులను యాపిల్ అవలంభిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు సీసీఐ ఆదేశించింది. సీసీఐ ఇన్వెస్టిగేషన్ విభాగమైన డైరెక్టర్ జనరల్ నుంచి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని కౌర్ తెలిపారు.
Google Accounts: గూగుల్ అకౌంట్ వాడట్లేదా... అయితే మీ అకౌంట్ ఇక డిలీటే!
కంపెనీల పోటీ వ్యతిరేక పద్ధతులకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు లభించిన సందర్భంలో పూర్తిస్థాయి విచారణను సీసీఐ డైరెక్టర్ జనరల్‌కు అప్పగిస్తుంది. ఇంతకుముందు ఆండ్రాయిడ్ సిస్టమ్, ప్లేస్టోర్‌కు సంబంధించిన కేసులలోనూ గూగుల్‌కి వ్యతిరేకంగా సీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
India Ai MOU with Meta: కొత్త టెక్నాలజీ దిశగా ఏఐ.. మెటాతో జట్టు
Published date : 13 Oct 2023 10:10AM