Skip to main content

INS Sandhayak: భారత నౌకాదళంలోకి అతి పెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌

దేశంలో రూపొందిన అతి పెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌.. 2023, డిసెంబరు 4న భారత నౌకాదళంలో చేరింది.
INS Sandhayak   Indian Navy Welcomes INS Sandhayak on December 4
INS Sandhayak

 కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని నాలుగు సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీని పొడవు 110 మీటర్లు. డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నౌకను లాంఛనంగా నేవీకి  అప్పగించారు. ఇది తీర ప్రాంతంలో, సాగరంలో హైడ్రోగ్రఫిక్‌ సర్వేలను నిర్వహిస్తుంది. నేవిగేషన్‌ మార్గాల నిర్ధారణకూ సహాయపడుతుంది. రక్షణ అవసరాల కోసం సముద్ర, భౌగోళిక డేటాను ఇది సేకరిస్తుంది.

President Murmu launches Vindhyagiri: యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ జలప్రవేశం

Published date : 12 Dec 2023 02:41PM

Photo Stories