Marriages Act: ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు.. ఇకపై పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు–2024ను తీసుకువచ్చింది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.
గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది.
Tags
- Muslim Marriages
- Repealing Bill
- Marriages Act
- Assam Assembly
- Divorce Act
- CM Himanta Biswa Sarma
- Divorce Registration Act
- Marriages
- Sakshi Education Updates
- National News
- Muslim Marriage Act
- AssamAssembly
- MuslimMarriages
- DivorceBill2024
- CompulsoryRegistration
- HimantaBiswaSarma
- ChildMarriages
- MuslimMarriageAct
- GovernmentRegistration
- SakshiEducationUpdates