Delhi Zoo uses water sprinklers to prevent air pollution: కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం జూ సిబ్బంది ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు.
GRAP-III in Delhi: గ్రాప్- 3 అంటే ఏమిటి? ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్‌లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు.
జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు.
Air pollution in Delhi: దేశ రాజధానిలో ప్రమాదక స్థాయిలో వాయు కాలుష్యం
Tags
- Delhi Zoo uses water sprinklers for air pollution
- Delhi Zoo uses water sprinklers to prevent air pollution
- Delhi Zoo
- Delhi Zoo precautions for air pollution
- ZooParkStaff
- WateringPlants
- PollutionPrevention
- AnimalWelfare
- ConservationEfforts
- EnvironmentalProtection
- ZooMaintenance
- EcosystemCare
- AnimalHealth
- PlantCare
- Sakshi Education Latest News