Defence ministry: ఎన్ని రక్షణ పరికరాల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది?
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మరికొన్ని రక్షణ సంబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2022, డిసెంబర్ నుంచి విడతలవారీగా అమల్లోకి వచ్చే ఈ ఆంక్షల పరిధిలోకి 351 ఉప వ్యవస్థలు, పరికరాలను చేర్చింది. దేశాన్ని సైనిక సామగ్రి ఉత్పత్తి కేంద్రంగా, స్వయం సమృద్ధంగా మార్చే లక్ష్యంతో గత 16 నెలల్లో రక్షణశాఖ ప్రకటించిన మూడో జాబితా ఇది. తాజా జాబితా అమలైతే దేశానికి ఏటా రూ.3వేల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆ శాఖ తెలిపింది. ఈ 351 వ్యవస్థలు, పరికరాలు వచ్చే మూడేళ్లలో దేశంలోనే తయారవుతాయని, వీటిని భారతీయ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని డిసెంబర్ 29న వెల్లడించింది.
తాజా నిషేధిత జాబితాలో లేజర్ వార్నింగ్ సెన్సార్లు, హై ప్రెజర్ చెక్ వాల్వ్‌లు, హై ప్రెజర్ గ్లోబ్ వాల్వ్‌లు, వివిధ రకాల కేబుళ్లు, సాకెట్లు, ఓల్టేజి కంట్రోల్ ఆసిలేటర్లు ఉన్నాయి. విదేశాలపై ఆధారపడటం తగ్గించే లక్ష్యంతో కేంద్రం 2020, ఆగస్టులో మొదటి జాబితా, 2021, మేలో 2వ జాబితా ప్రకటించింది.
చదవండి: ఇటీవల నరేంద్ర మోదీ మార్గ్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 351 రక్షణ సంబంధ ఉత్పత్తులపై నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశాన్ని సైనిక సామగ్రి ఉత్పత్తి కేంద్రంగా, స్వయం సమృద్ధంగా మార్చే లక్ష్యంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్