Brain Stroke: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ‘బ్రెయిన్ స్ట్రోక్’ మరణాలు
ఈ సమస్యకు గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, జీవన శైలి వ్యాధులు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’ తాజా నివేదికలో పేర్కొంది.
రిస్క్ ఫ్యాక్టర్స్: అధిక బరువు, రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు: 1990 తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మరణాలలో 72% పెరుగుదలకి కారణం అవుతున్నాయి. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశముందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
గాలి కాలుష్యం: బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడానికి గాలి కాలుష్యం ప్రధాన కారణమని మొదటిసారి వెల్లడైంది.
గణాంకాలు: 1990లో 73 లక్షల మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, 2021లో ఈ సంఖ్య 1.19 కోట్లకు చేరింది.
ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాయని అక్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వాలెరీ ఫిజిన్ తెలిపారు. శుభ్రమైన గాలి, బహిరంగ పొగ తాగడాన్ని నిషేధించడం గత మూడు దశాబ్దాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
XEC Covid Variant: మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. ఏకంగా 27 దేశాలకు..!