Ganga Prasad: ఇటీవల నరేంద్ర మోదీ మార్గ్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
సిక్కిం రాష్ట్రంలో ఉన్న నాథులా కనుమలోని త్సోంగో సరస్సును గాంగ్‌టాక్‌తో కలిపే రెండో రహదారికి సిక్కిం ప్రభుత్వం ‘నరేంద్రమోదీ మార్గ్’గా పేరు పెట్టింది. 51 క్యోంగ్‌శాల గ్రామ సమీపంలో ఈ రహదారిని సిక్కిం రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ డిసెంబర్ 29న అధికారికంగా ప్రారంభించారు. 19.51 కిలోమీటర్ల ఈ డబుల్ లేన్ రోడ్డుకు నరేంద్ర మోదీ మార్గ్‌గా నామకరణం చేయాలంటూ 2021, డిసెంబర్ 20వ తేదీన 51 క్యోంగ్ శాల గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం విదితమే.
చదవండి: గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నరేంద్రమోదీ మార్గ్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : సిక్కిం రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్
ఎందుకు : సిక్కిం రాష్ట్రంలో ఉన్న నాథులా కనుమలోని త్సోంగో సరస్సును గాంగ్‌టాక్‌తో అనుసంధానించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్