Skip to main content

Government Bans Smartphones In Schools: స్కూళ్లలో ఫోన్ల వాడకంపై నిషేధం.. ప్రభుత్వం ఆదేశాలు

French government announces ban on cellphones in schools  Government Bans Smartphones In Schools France Bans Smartphones In Schools

పారిస్‌: సెల్‌ఫోన్‌.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్‌ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్‌ మారిన సెల్‌ఫోన్‌ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం నడుం కట్టింది. 

Teachers Day Special: అరుదైన అవకాశం.. చదువుకున్న స్కూలుకే టీచర్లుగా..

వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్‌ మిడిల్‌ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్‌ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. 

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ఈ కార్యక్రమానికి ‘డిజిటల్‌ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్‌ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్‌ కమ్యూనికేషన్‌ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్‌ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్‌ చేయాలన్న నిబంధన లేదు.

Published date : 05 Sep 2024 03:51PM

Photo Stories