High Package Job : ఈ అమ్మాయికి ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం.. ఈ జాబ్ ఎలా వచ్చిందంటే...?
ఈమె ఆంధ్రప్రదేశ్ కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి. ఈ నేపథ్యంలో అమృతవల్లి సక్సెస్ జర్నీ మీకోసం..
ఎడ్యుకేషన్ :
అమృతవల్లి.. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. జేఈఈ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి.. దుర్గాపూర్ ఎన్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్ (Computer Science) ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎంఎస్ పూర్తి చేశారు.
☛➤ Dipali Goenka Success Story: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్.. ఎవరీ దీపాలి?
కేవలం నెల రోజుల్లోనే..
చదువు పూరైన నెల రోజుల్లోనే... వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ప్రఖ్యాత కంపెనీ అమెజాన్ సెంట్రల్ ఆఫీస్‌లో ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. కసి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే చాలు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చుని అమృతవల్లి తెలిపారు. నేడు అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు, ఆటలు పాటలు ఇలా అన్నీ రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారనేదానికి అమృతవల్లి సక్సెస్ ఒక మంచి ఉదాహరణ.
Tags
- Success Story
- IT Job Success Story
- success women
- Inspire
- high salary package jobs
- Amrutha Valli Success Story
- Software Jobs
- IT Job Amrutha Valli Success Story
- Engineering Software Engineering
- Engineering Success Speaks
- Success Stories
- highest salary 1.70 core it job holder amrutha valli success stroy
- highest salary 1.70 core it job holder amrutha valli success stroy in telugu
- telugu news highest salary 1.70 core it job holder amrutha valli success stroy