Banks Working Days: ఎల్ఐసీలాగే ఇకపై బ్యాంకులకు 5 రోజులే వర్క్... ఎప్పటినుంచంటే...!
తమకు వారానికి ఐదు రోజుల పనిదినాలే కల్పించాలని గత కొన్నేళ్లుగా బ్యాంకు యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి.
తాజాగా ఎల్ఐసీ పనిదినాలను 5 రోజులకు కుదించడంతో బ్యాంకర్లకు ఈ మేరకు అవకాశాలు కల్పించేసూచనలు కనిపిస్తున్నాయి. రోజూ 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాలని ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు జులై 28న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ (యూఎఫ్‌బీఏ)తో ఐబీఏ సమావేశం కానుంది. బ్యాంకు ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చదవండి: దేశవ్యాప్తంగా 58 వేల ఉపాధ్యాయ ఖాళీలు... ఆర్టీఐ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి
బ్యాంకుల పనిదినాలను వారానికి 5 రోజులు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఐబీఏ కూడా తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది.
ఇవీ చదవండి: ఈ చిట్కాలు పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే... మీర్జాపూర్ కలెక్టర్ దివ్యమిట్టల్ సక్సెస్ టిప్స్ మీకోసం...!
ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి, పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది.