APPSC GROUP 2: గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, స్టయిఫండ్.. ఎక్కడ, ఎన్ని రోజులంటే..?
Sakshi Education
ఏపీపీఎస్సీ గ్రూప్–2 రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన పేదల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా అధికారి బి.భాస్కర్‌రెడ్డి డిసెంబర్ 17న (ఆదివారం) తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు డిసెంబర్ 22వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 27 నుంచి 50 రోజులపాటు ఉచిత శిక్షణతోపాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీలో మార్కుల మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎంపికై న వారికి తిరుపతి ఎమ్మార్‌పల్లె బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. దరఖాస్తులను తిరుపతిలోని ఏపీబీసీ స్టడీ సర్కిల్ ఫర్ బీసీఎస్, డోర్ నంబర్ 4–171 –2లో సమర్పించాలని సూచించారు. వివరాలకు 9441456039, 9985022254, 9346221553 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
IT Companies: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త.. మిగిలిన ఐటీ కంపెనీల పరిస్థితి ఇదే..!
Published date : 18 Dec 2023 12:16PM