Unemployment in USA: అమెరికాలోనూ నిరుద్యోగ భృతి... లక్షల్లో దరఖాస్తు చేసుకుంటున్న అమెరికన్లు.. ఎందుకంటే
ఫలితంగా రోడ్డున పడిన ఉద్యోగులంతా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
IAS, IPS officers: ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇకపై ఆ అనుమతి తప్పనిసరి.... ఎందుకంటే
అమెరికాలో నిరుద్యోగులకు ప్రభుత్వమే కొన్ని ప్రయోజనాలను కల్పిస్తుంది. నిర్ధిష్ట కాలపరిమితి వరకు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలుస్తుంది. దీంతో ఉద్యోగం ఊడిన వారంతా నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సంఖ్య ప్రస్తుతం 2,62,00కి చేరింది. గతేడాది నవంబరు తర్వాత భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇదే అత్యధికం.
అమెరికాలో నియామకాలపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నిరుద్యోగ దరఖాస్తులు పెరుగుతున్నాయి. గత ఆరువారాల్లో వరుసగా ఐదు వారాలు దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలు స్థిరంగా ఉంది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. చూస్తుంటే కోవిడ్ సమయంలో అమెరికన్లు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.