Skip to main content

Bank Holidays July 2023: జులైలో బ్యాంకుల‌కు ఏయే రోజులు సెల‌వులో తెలుసా..?

వచ్చే జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా దాదాపు 15 రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవులు ప్రకటించింది. మొదటి, మూడో శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తెరిచి ఉంటాయి.
Bank Holidays July 2023
Bank Holidays July 2023

ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవులు, రాష్ట్రాలు నిర్దేశించిన ప్రకారం స్థానిక సెలవు దినాలలో బ్యాంకులు పనిచేయవు.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే అనే మూడు కేటగిరీల కింద ఆర్బీఐ సాధారణంగా ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది.

వచ్చే జూలైలో మొదటి సెలవు జూలై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజుతో ప్రారంభమవుతుంది. జూలై 29న మొహర్రం తో జులై సెల‌వులు ముగుస్తాయి. కొన్ని రాష్ట్రాలు మినహా ఈ సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి.

Inspirational Story: అడవి బిడ్డల నేస్తం... ఫ్లారెన్స్‌ నైటింగేల్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏఎన్ఎం

Bank Holidays July 2023

జూలై నెల బ్యాంకు సెలవులు ఇవే..

జూలై 4:  ఆదివారం
జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్)
జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే (MHIP Day) (మిజోరాం)
జూలై 8: రెండో శనివారం
జూలై 9: ఆదివారం
జూలై 11: కేర్ పూజ (త్రిపుర)

Telangana Schools New Timings 2023 : స్కూల్స్ టైమింగ్స్‌లో మార్పులు..! ఈ సమయాల్లోనే..
జూలై 13: భాను జయంతి (సిక్కిం)
జూలై 16: ఆదివారం
జూలై 17: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయ)
జూలై 22: నాలుగో శనివారం
జూలై 23: ఆదివారం
జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో)
జూలై 30: ఆదివారం
జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్)

Published date : 24 Jun 2023 05:06PM

Photo Stories