Telangana Schools New Timings 2023 : స్కూల్స్ టైమింగ్స్‌లో మార్పులు..! ఈ సమయాల్లోనే..
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పాఠశాలల సమయాలు మార్చాలంటే ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. నిపుణులతో చర్చించి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం జరుగుతుందని కొందరు సూచిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 7.30 నుంచి 8 గంటల మద్యలోనే పిల్లల్ని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు అందుకు భిన్నంగా ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉదయం 9 గంటల లోపే పొలం పనులకు, కూలి పనులకు వెళ్తారు. అలాంటప్పుడు ఆలస్యంగా బడులు తెరిస్తే ఇబ్బంది అవుతుంది.
ఉదయం సాధ్యమైనంత త్వరగా తరగతులు మొదలైతేనే పాఠాలు బాగా అర్థమవుతాయి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత పాఠశాలలకు అనేక మంది పిల్లలు పొరుగు ఊళ్ల నుంచి వస్తారు. అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తారు. ప్రాథమిక పాఠశాలలకు పొరుగు ఊళ్ల నుంచి పిల్లలు రారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంది అని మరికొందరు పేర్కొంటున్నారు.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు..
ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9 గంటలకు మొదలుకావాలి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా బడి సమయాలు ఉన్నాయి అని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. అందువల్ల అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ స్కూల్స్ 2023-24 అకడమిక్ ఇయర్ పూర్తి వివరాలు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.