IAS, IPS officers: ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇకపై ఆ అనుమతి తప్పనిసరి.... ఎందుకంటే
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రైవేటు సంస్థలు అందజేసే అవార్డులు స్వీకరించే తప్పనిసరిగా కేంద్ర అనుమతి తీసుకునితీరాల్సిందే. అవార్డులు నగదు రూపంలో ఉండకూడదు. అలాగే సౌకర్యాల పరంగానూ ఉండడానికి వీల్లేదు.
అధికారుల సేవలను మెచ్చి ఏవైనా ప్రైవేటు సంస్థలు లేదా ప్రైవేటు వ్యక్తులు అవార్డులను ఎరగా వేస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. అవార్డుల పేరుతో భారీగ నగదు బహుమతి అందజేయడం, అదనపు ప్రయోజనాలను ఎరగా వేసి తమ పనులు చేసుకున్నట్లు కేంద్రం గుర్తించింది.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
ఈ నేపథ్యంలో ఇకపై అఖిల భారత సర్వీసు అధికారులు తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకున్న తర్వాతే అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు కాంపిటెంట్ అథారిటీ ముందస్తు అనుమతితో మాత్రమే అవార్డులు స్వీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది.
NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్లకే పెళ్లి... 20 ఏళ్లకు పాప... ఐదో ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
నూతన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల విషయంలో కాంపిటెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రంలో పనిచేస్తున్న అధికారుల విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖ/ శాఖ కార్యదర్శి కాంపిటెంట్ అథారిటీ గా ఉంటుంది. భారత ప్రభుత్వ కార్యదర్శుల విషయంలో కేబినెట్ కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
"అవార్డు నగదు లేదా సౌకర్యాల రూపంలో ఉండకూడదు" అనే నిబంధన ఇకపై తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుంది. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారులకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఇచ్చే అవార్డులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని, వారి ప్రతిభను.. సేవలను ప్రభుత్వమే గుర్తించి ప్రోత్సహిస్తోందని సిబ్బంది మంత్రిత్వ శాఖ పేర్కొంది.