Covid After Omicron: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్
Sakshi Education
ఒమిక్రాన్ వేరియెంట్ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది.
కోవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నివేదిక తెలిపింది. చిన్న పనికే అలిసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, సెక్స్‌పై అనాసక్తత, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివన్నీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని ఆ నివేదిక వివరించింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (07-13 మే 2023)
Published date : 27 May 2023 08:47AM