Parker Solar Probe: చరిత్ర సృష్టించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడి ‘కరోనా’ను తాకింది!!
నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా డిసెంబర్ 27వ తేదీ ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది.
ఇది కేవలం భగభగ మండే సూర్యుని కరోనా గుండా ప్రయాణించి, ఎలాంటి ముప్పు లేకుండా సురక్షితంగా ఉండటంతో, ఇది ఒక గొప్ప విజయంగా భావించబడుతోంది.
NISAR satellite: త్వరలో ‘నాసా–ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్’ ప్రయోగం
పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడి బాహ్య వాతావరణం (కరోనా)లోకి ప్రవేశించి, అక్కడి అత్యధిక ఉష్ణోగ్రతను పరిశీలిస్తుంది. గత డిసెంబర్ 26వ తేదీ ఈ నౌక నుంచి నాసాకు సంకేతాలు అందాయి, కానీ, సూర్యుడి అత్యంత ఉష్ణోగ్రత వద్ద పార్కర్ సోలార్ ప్రోబ్ చక్కర్లు కొట్టడంతో, తాత్కాలికంగా సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగి చేరుకున్న తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి.
ఈ నౌక ఇప్పటివరకు నిర్మించబడిన అంతరిక్ష నౌకలలో అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. పార్కర్ సోలార్ ప్రోబ్ పై ప్రత్యేకమైన హీట్ షీల్డ్ అమర్చడం ద్వారా, అది 1,370 డిగ్రీల సెల్సియస్ (2,500 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలుగుతుంది. ఈ ప్రయోగం.. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది.
POEM-4 in PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60లో పీఎస్-4తో విభిన్న ప్రయోగాలు