Skip to main content

Russian Missiles: ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణుల వర్షం

ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక వనరులే లక్ష్యంగా రష్యా మరోసారి భారీగా క్షిపణి దాడులకు పాల్పడింది. డిసెంబ‌ర్ 29న ఒక్క రోజు వ్యవధిలోనే రష్యా ప్రయోగించిన 69 మిస్సైళ్లలో 54 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది.

రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఇది 10వ అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్‌ ప్రధాని డెనిస్‌ అభివర్ణించారు. డిసెంబ‌ర్ 28 రాత్రి నుంచి పేలుడు పదార్థాలతో కూడిన రష్యా డ్రోన్లు వివిధ ప్రాంతాలపైకి దూసుకొచ్చాయని తెలిపింది. దీంతో, దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తంగా చేస్తూ సైరన్లు మోగాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌–300 క్షిపణిని తమ బ్రెస్ట్‌ ప్రాంతంలో కూల్చివేశామని రష్యా మిత్ర దేశం బెలారస్‌ ప్రకటించింది. అది పొరపాటున వచ్చి ఉంటుందని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఉక్రెయిన్‌ తెలిపింది. అయితే, తాము ఆక్రమించిన ఉక్రెయిన్‌లోన భూభాగాలను తమవిగా ఒప్పుకుంటేనే చర్చలకు సిద్ధమని రష్యా తెగేసి చెప్పింది.

Ukraine war: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీ ప్రాణనష్టం

 

Published date : 30 Dec 2022 04:32PM

Photo Stories