ISS : సొంతంగా నిర్మించుకుంటామన్న రష్యా
అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి రష్యా వైదొలగనుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో సఖ్యత పాడవడంతో రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 2024 ఏడాది తర్వాత ఐఎస్‌ఎస్‌లో రష్యా భాగస్వామిగా ఉండబోదని రష్యా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ(రోస్ కాస్మోస్) చీఫ్ యూరీ బొరిసోవ్ జూలై 26న చెప్పారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని స్పష్టంచేశారు.
also read: Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ముఖ్యమైన రెండు భాగాలున్నాయి. ఒకటి రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తుండగా మరోటి అమెరికా, ఇతర దేశాల భాగస్వామ్యంలో నడుస్తోంది. రష్యా నిష్క్రమించాక మొదటి భాగం బాధ్యతలు, నిర్వహణ ఖర్చులు ఎలా విభజిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. భూమికి దాదాపు 250 మైళ్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించే ఐఎస్‌ఎస్‌లో దాదాపు ఏడుగురు వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలు చేస్తుంటారు. భారరహిత స్థితిలో నెలల తరబడి అక్కడే ఉంటూ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నూతన పరికరాలనూ పరీక్షిస్తుంటారు. ఇటీవల నాసాతో రష్యాకు సంబంధాలు చెడిపోయాయి. ఇంతకాలం రష్యా రాకెట్లలో వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లినందుకు నాసా ఆ దేశానికి భారీ చెల్లింపులు జరిపేది. కొత్తగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుని రష్యాను ఆర్థికంగా దెబ్బతీసింది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP