13th Brics Summit: 2021 ఏడాది జరిగిన బ్రిక్స్ దేశాల 13వ సదస్సు థీమ్ ఏమిటీ?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బ్రిక్స్ దేశాల 13వ సదస్సు జరిగింది. సెప్టెంబర్ 9న ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో పాల్గొన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై బ్రిక్స్ దేశాధినేతలు విస్రృత చర్చలు జరిపారు. ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
డిక్లరేషన్ విడుదల...
బ్రిక్స్ సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని కోరాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌ను సభ్యదేశాలు ఆమోదించాయి.
జలవనరుల మంత్రుల తొలి సమావేశం...
బ్రిక్స్ దేశాలు రూపొందించుకున్న కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. తాజా సమావేశం బ్రిక్స్ చరిత్రలో తొలి డిజిటల్ సదస్సని గుర్తు చేశారు. 2021, నవంబర్‌లో బ్రిక్స్ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. బ్రిక్స్ చైర్మన్‌గా ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
బ్రిక్స్ విశేషాలు...
- ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ ‘‘ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్’’.
- ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే.
- 2006లో తొలిసారి బ్రిక్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది.
- 2009లో తొలి బ్రిక్ సమావేశం రష్యాలో జరిగింది.
- బ్రిక్ అనే పదానికి రూపా పురుషోత్తమన్ రూపకల్పన చేశారు. కానీ క్రెడిట్ మాత్రం జిమ్ ఓ నీల్‌కు వచ్చింది.
- బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది.
- 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది.
- ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్
- సదస్సుకు అధ్యక్షత వహించారు.