Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం
కనీసం 820 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.
China New Map Objections: చైనా నూతన మ్యాప్‌పై భారత్ బాటలో పలు దేశాలు
శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 6.8 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది.
మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం.
China New Map: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ మావేనంటూ చైనా కొత్త మ్యాప్ విడుదల