China New Map: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ మావేనంటూ చైనా కొత్త మ్యాప్ విడుదల
భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ‘ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్’ పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మ్యాప్ పొరుగు దేశాలతో చైనా జాతీయ సరిహద్దులను డ్రాయింగ్ పద్దతి ద్వారా చూపుతోంది.
UPI Payment's in New zealand: న్యూజిలాండ్‌లో యుపీఐ చెల్లింపులకు భారత్ చర్చలు
చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ తమ భూభాగంలోనివిగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. భారత్‌లోని వివాదాస్పద భూభాగాలతోపాటు, తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడా తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది.
Fukushima Released Radioactive water: ఫ్యుకుషిమా జపాన్ అణు జలాల సముద్రంలోకి విడుదల
అయితే దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలకు వివాదాలు కలిగి ఉన్నాయి. కాగా 1962లో భారత్‌తో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకున్న చైనా.. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. అయినా చైనా తన తీరును మార్చుకోలేదు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.