India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు..
Sakshi Education
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు.
![Call for President Muizju's Removal in Maldives Maldivian Ministers Insulting PM Modi Maldives Leader Calls For Steps To Remove President Muizzu amid row with India](/sites/default/files/images/2024/01/09/mmuizzu-1704791239.jpg)
అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు. మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
'స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన మేము ప్రయత్నించాం. పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పాము. అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాల్దీవుల సెక్రెటేరియట్ సిద్ధంగా ఉందా? విశ్వాసం లేదా?' అని నాయకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Maldives: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు మంత్రులు సస్పెండ్..
Published date : 09 Jan 2024 02:37PM