Skip to main content

Russia-Ukraine War: రష్యాకు ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌తో యుద్ధంతో రష్యాకు తొలిసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తూర్పున ఖర్కీవ్‌ ప్రావిన్స్‌లో ఇజియుం పట్టణంతో పాటు పలుచోట్ల ఉక్రెయిన్‌ దళాల చేతిలో రష్యా సేనలు సెప్టెంబర్ 10 న  ఓటమి చవిచూశాయి.
Battle lines are redrawn in Ukraine
Battle lines are redrawn in Ukraine

ఉక్రెయిన్‌ సైనికుల కాల్పుల ధాటికి తాళలేక వెనుకంజ వేశాయి. దానికితోడు అన్నివైపుల నుంచీ ఉక్రెయిన్‌ దళాలు చుట్టుముట్టే ప్రమాదముండటంతో తమ సైన్యాన్ని వెనక్కు రావాల్సిందిగా రష్యా ఆదేశించింది. దాంతో భారీ సంఖ్యలో ఆయుధాలు తదితరాలను అక్కడే వదిలి మరీ రష్యా సేనలు వెనుదిరగాల్సి వచ్చింది. ఫిబ్రవరి 24 నుంచి 200 రోజులుగా సాగుతున్న యుద్ధంలో దీన్ని కీలక మలుపుగా భావిస్తున్నారు. 

Also read: US Intelligence Report: రష్యాకు ఉత్తర కొరియా రాకెట్లు

యుద్ధం తొలినాళ్లలో రాజధాని కీవ్‌ను రష్యా భారీ ముట్టడి నుంచి విజయవంతంగా కాపాడుకున్న తర్వాత ఉక్రెయిన్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ పరిణామం పట్ల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘రష్యా సేనలు ఇటీవల తమకు బాగా వచి్చన వెన్నుచూపే విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు. అక్కడ రష్యా సేనలకు సరఫరాలను పూర్తిగా అడ్డుకున్నట్టు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెంజికోవ్‌ ప్రకటించారు. త్వరలో మరిన్ని విజయాలు తథ్యమన్నారు. ఈ ఎదురుదెబ్బతో తల బొప్పి కట్టిన రష్యా పరువు కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. డొనెట్స్‌క్‌ ప్రాంతంలో సైన్యాన్ని బలోపేతం చేయడానికే ఇజియం తదితర చోట్ల నుంచి దళాలను వెనక్కు రప్పించామంటూ రక్షణ శాఖ ప్రకటన చేసింది. కీవ్‌ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగినప్పుడు కూడా రష్యా ఇలాంటి ప్రకటనే చేయడం గమనార్హం. ఈ పరిణామంపై రష్యాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం యుద్ధ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసి తిరిగి పైచేయి సాధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పుతిన్‌ శనివారం మాస్కో పార్కులో ఓ అబ్జర్వేషన్‌ వీల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సజావుగా సాగుతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నాల్లో భాగమేనంటున్నారు.

Also read: Russia President: 'మదర్‌ హీరోయిన్‌'లకు నజరానా

తూర్పుపై సడలిన పట్టు! 
డొనెట్స్‌క్‌ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించడంలో ఇజియుం, పరిసరాల్లో మోహరించిన సేనల పాత్రే కీలకం. అవిప్పుడు అక్కడి నుంచి వెనుదిరగడం డొనెట్స్‌క్‌పై రష్యా పట్టును కూడా బాగా దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. తాజా పరాభవానికి సైనిక నాయకత్వం తప్పిదాలే కారణమంటూ రష్యా అనుకూల చెచెన్యా నాయకుడు రమజాన్‌ కదిరోవ్‌ కూడా దుయ్యబట్టారు. వ్యూహం మార్చుకుని ప్రత్యేక సైనిక చర్య చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటుతుందన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతును కొనసాగించాలని యూరప్‌ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది.

Also read: US President Joe Biden: చారిత్రాత్మక బిల్లుకు బైడెన్‌ ఆమోదం

అణు విద్యుత్కేంద్రం స్వాధీనం 
యుద్ధ తొలినాళ్లలోనే రష్యా ఆక్రమించుకున్న జపోరిజియాలోని కీలక అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. యూరప్‌లోనే అతి పెద్దదైన ఈ కేంద్రాన్ని ఆదివారం దేశ విద్యుత్‌ గ్రిడ్‌కు సంధానించింది. అనంతరం రేడియేషన్‌ లీకేజీ ముప్పును నివారించేందుకు అందులో పని చేస్తున్న చివరి రియాక్టర్‌ను కూడా ఇంజనీర్లు విజయవంతంగా నిలిపేశారు. రియాక్టర్లను నిత్యం చల్లగా ఉంచేందుకు ఇకనుంచి ఎమర్జెన్సీ జనరేటర్లను నడపాల్సి ఉంటుంది.

Also read: China - Srilanka: చైనా నిఘా నౌకకు శ్రీలంక పచ్చజెండా

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:23PM

Photo Stories