World Standards Day: అక్టోబర్ 14వ తేదీ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
ఈ రోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్‌ఓ)తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రమాణాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు నిపుణులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణీకరణ ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు అవగాహన పెంచడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఏడాది థీమ్.. "ఉత్తమ ప్రపంచానికి భాగస్వామ్య దృష్టి: మారుతున్న వాతావరణానికి ప్రమాణాలు(Vision for a Better World: Standards for the Changing Climate)". ఈ థీమ్ వాతావరణ మార్పుల విషయంలో సామూహిక లక్ష్యాలను సాధించడంలో సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
International Day of Girl Child: అక్టోబర్ 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం..
తొలిసారిగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1970లో నిర్వహించారు. ప్రామాణీకరణను సులభతరం చేయడానికి అంతర్జాతీయ సంస్థను రూపొందించాలని నిర్ణయించిన 25 దేశాల ప్రతినిధులు 1956లో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలోనే 1847లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్‌ఓ)ఏర్పాటయ్యింది.
సామాజిక అసమతుల్యతలను పరిష్కరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐఎస్‌ఓ ఏర్పాటయ్యింది. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ప్రామాణీకరణ కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 1947 సంవత్సరంలో దీనిని స్థాపించారు.
1986లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ పేరును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌గా మార్చారు. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల పరిధిలో పని చేస్తుంది.
October Important Days: అక్టోబర్ నెలలోని జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఇవే..