GatiShakti: పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు మూడేళ్లు పూర్తి
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే పీఎంజీఎస్–ఎన్‌ఎంపీ లక్ష్యమని మోదీ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని పూర్తి చేయడంలో ఈ పథకం వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
‘దేశ మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మకంగా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ‘పీఎం గతిశక్తి’ ఉద్భవించింది. ఇది మల్టిమోడల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగు పరిచింది, వివిధ రంగాలలో వేగవంతమైన, మరింత ప్రభావవంతమైన అభివృద్ధికి దారితీసింది. వివిధ వాటాదారుల ఏకీకరణతో లాజిస్టిక్‌లకు ప్రోత్సాహం లభించింది. జాప్యాలను తగ్గించింది. చాలా మందికి కొత్త అవకాశాలను సృష్టించింది. గతిశక్తి కారణంగా వికసిత్ భారత్ అనే మా స్వప్నం సాకారం చేసే దిశలో దేశం వేగంగా ముందుకుసాగుతోంది. ఇది అభివృద్ధిని, పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Indian Institute of Skills: భారతీయ నైపుణ్యాల సంస్థను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ ప్రణాళిక ప్రధానంగా 44 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సమగ్ర డేటాను సమీకరించడం ద్వారా ప్రాజెక్ట్ అమలును గణనీయంగా మెరుగుపరిచింది.