Skip to main content

World Forestry Day 2024: అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ఈ ఏడాది థీమ్‌ ఏంటంటే..

World Forestry Day 2024   Environment awareness
World Forestry Day 2024

ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2012 నుంచి దీన్ని పాటిస్తున్నారు. అడవుల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన‌ పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. మనిషి మనుగడకు దోహదపడే అడవులు జీవవైవిధ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

ఈ ఏడాది థీమ్‌ ఇదే..

పక్షులు, జంతువులు, వివిధ రకాల కీటకాలకు ఆవాసాలుగా మారిన అడవులు అంతరించిపోతే అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రాణకోటికి ఆవాసంగా ఉన్న అడవుల రక్షణ అత్యంత అవసరం. అడవులు సమతుల్యత లోపిస్తే వాటిపై ఆధారపడి జీవించే వాటిపై ప్రభావం పడి అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది.

ఈ భూమిపై అడవులే లేకపోతే… సకల జీవరాశే లేదు. అయితే ఈమధ్య ప్రాజెక్టుల నిర్మాణం, గృహాల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటీకి అంతరించి పోతున్నాయి. మానవ మనుగడకు అవసరమైన అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అడవులు మరియు ఆవిష్కరణలే ఈ ఏడాది అటవీ దినోత్సవానికి సంబంధించిన థీమ్‌. 

Published date : 22 Mar 2024 10:42AM

Photo Stories