Open school Admission 2024: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంలో అడ్మిషన్ పొంది మళ్లీ చదువుకోవచ్చు ...
Sakshi Education
చంద్రగిరి: మధ్యలో చదువు మానేసిన, పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంలో అడ్మిషన్ పొంది మళ్లీ చదువుకోవచ్చని స్టేట్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగేంద్రరావు తెలిపారు. ఆయన శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సమావేశమయ్యా రు. ఆయన మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్, మధ్యలో నిలిచిపోయిన లేదా రెగ్యులర్‌గా పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఓపెన్ స్కూల్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురుస్వామి రెడ్డి మాట్లాడుతూ ఏదైనా సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసై రెగ్యులర్ వారి మాదిరిగా సర్టిఫికెట్ పొందవచ్చని తెలియజేశారు. ఎంఈవోలు భాస్కర్ బాబు, లలిత కుమారి పాల్గొన్నారు.
Published date : 19 Aug 2024 03:45PM