Guidelines for Parents in society: ఆడపిల్లలకే ఆంక్షలు..అడుగడుగునా జాగ్రత్తలా..!? మగపిల్లలకు మంచీచెడులు చెప్పరా..?
నిర్భయ, అభయ, కోల్‌కతా డాక్టర్‌లపై అఘాయిత్యాలకు పాల్పడింది మృగాళ్లుగా మారిన మగాళ్లే అని సమాజం ఎందుకు ఆలోచించడం లేదు. తమ బిడ్డకు పది ప్రశ్నలు వేసే తల్లిదండ్రులు తమ కొడుకులు ఏం చేస్తున్నారోనని ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగటం లేదు. చిన్నప్పటి నుంచి మగాడన్న గారాబమే చాలామంది యువతను తప్పుదోవ పట్టిస్తోందని మానసిక నిపుణులూ చెబుతున్నారు.
Also Read: Reliance Foundation Scholarships: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
మగపిల్లలకు చెప్పడం లేదు..
ఏది గుడ్‌టచ్, ఏది బ్యాడ్ టచ్ అని.. ఆడపిల్లలకు చెప్పే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మగపిల్లలకు ఇలా చేయొద్దు.. అని చెప్పడం లేదు. బిడ్డలను కూర్చోబెట్టుకుని సవాలక్ష జాగ్రత్తలు చెప్పినట్లు, కనీసం ఒక్కరోజూ కొడుకుతో మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. చాలా కుటుంబాలు ఆడపిల్ల లను ఒకలా, మగపిల్లలను మరోలా పెంచుతున్నారు. ‘వాడు మగపిల్లాడు.. ఎట్లుంటే ఏమైతది..’అని నాన్నమ్మతాతలు మొదలు అమ్మనాన్నల దాకా అందరూ లైట్‌గా తీసుకుంటున్నారు. చిన్నచిన్న తప్పులు చేసినా వెనకేసుకొస్తున్నారు. అసలు మగపిల్లలు ఏం చేస్తున్నారన్న ప్రశ్నే చాలా ఇళ్లల్లో తల్లిదండ్రులు వేయడం లేదు. ఇదే చాలామంది పిల్లలు తప్పుదోవ పట్టడానికి కారణమవుతోంది.
వ్యసనాలతో మొదలు..
ఇంటాబయట అడిగేవారు లేకపోవడంతో చాలా మంది అబ్బాయిలు హైస్కూల్ వయసులోనే చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. టీనేజ్‌లో వచ్చే శారీ రక, మానసిక మార్పుల విషయాలనూ తల్లిదండ్రులు చెప్పకపోవడం, కనీసం పాఠ్యాంశాల్లోనూ ఉపాధ్యాయులు సరిగా వివరించకపోవడంతో.. మిడిమి డి జ్ఞానంతో ఎవరో చెప్పే విషయాలకు ఆకర్షితులై వక్రమార్గం పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా సిగరెట్లు, మద్యం తాగుతున్నారు. ఇ టీవల జిల్లాలో కొన్ని గంజాయి కేసుల్లో టీనేజ్‌తో పాటు హైస్కూల్ విద్యార్థులూ సేవిస్తున్నట్లు తేల డం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి వంటి డ్రగ్స్ కు అలవాటైన తర్వాత మానసికంగా మరింతగా బ్యాలెన్స్ కోల్పోవడం, విపరీత ధోరణులకు పాల్పడటం చేస్తుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. వ్యసనాల కోసం కావాల్సిన డబ్బులను ఇంట్లో నుంచి దొంగతనం చేస్తున్నారు. చైన్‌స్నాచింగ్ చేసేవారిలోనూ టీనేజర్స్ ఉంటున్నారు. వీరు జల్సాల కోసమే ఈ పనులు చేస్తున్నట్లు చెబుతుండటం శోచనీయం. అర్ధరాత్రి వరకూ సెల్‌ఫోన్‌ను పట్టుకునే పిల్లలు ఏంచూస్తున్నారో.. వారి ధోరణి ఎలా ఉందో.. కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మగ పిల్లలకూ చెప్పాలి..
సమాజంలో ఆడపిల్ల లు, మగపిల్లలను వే రుగా చూసే భావనే చాలా ఘటనలకు కారణమవుతోంది. ఏది గుడ్‌టచ్, ఏది బ్యాడ్‌టచ్ అని ఆడపిల్లలకు చెప్పినట్లు, మగపిల్లలకూ ఏది చేయొద్దు.. ఏం చేయాలని చెప్పాలి. తమకు తల్లి, చెల్లి, అక్క ఉన్నారనే భావన వారిలో కలిగించాలి.
– డాక్టర్ విశాల్ ఆకుల, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ
చిన్నవయసులోనే..
జిల్లాలో ఇటీవల గంజాయి, మత్తుపదార్థాలపై సీరియస్‌గా దృష్టిపెడుతున్నాం. కొన్ని కేసుల్లో చిన్నవయసులోనే కొందరు ఇలాంటి వ్యసనాల బారిన పడుతున్నట్లు కనిపిస్తుండటం బాధాకరం. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నట్లే.. తమ మగపిల్లలూ ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వారిని సరైన మార్గంలో వెళ్లేలా చూడాలి.
–జానకీషర్మిల, ఎస్పీ