PM-Kisan scheme: నేడు ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నగదు
ఈ పథకం కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికీ రూ.13,500 సాయం అందుతోంది. ఖరీఫ్ పెట్టుబడికి జూన్‌లో రూ.7500 ప్రకారం, రబీ పెట్టుబడికి అక్టోబర్‌లో రూ.4 వేలు, పంట నూర్పిడి సమయంలో సంక్రాంతి కానుకగా మూడో విడతగా రూ.2 వేలు ప్రకారం గత నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లోకి జమ అవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది. అయితే కౌలుదారులు, అటవీభూముల సాగుదారులకు పూర్తి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
Indian Passport: వీసా లేకుండానే 57 దేశాలను చుట్టిరావొచ్చు... ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకోండి
ఈ క్రమంలో ఐదో ఏడాదికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా కింద జూన్ ఒకటిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రైతుకూ రూ.5,500 ప్రకారం జమ చేశారు. 2.87 లక్షల మందికి పైగా రైతులకు రూ.159 కోట్లు ఇచ్చారు. అయితే ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో పీఎం కిసాన్ కింద కేంద్రం వాటా రూ.2 వేలు కాస్త ఆలస్యమైంది. ఆ మొత్తాన్ని గురువారం విడుదల చేస్తున్నారు. పీఎం కిసాన్ కింద ఇపుడు 2.87 లక్షల మందికి పైగా రైతులకు రూ.57.50 కోట్ల వరకు పెట్టుబడిసాయం జమ కానుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద గత నాలుగేళ్లలో జిల్లా రైతులకు రూ.1,660 కోట్ల మేర ఇచ్చారు. ఇపుడు ఐదో ఏడాది కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.