Skip to main content

World Bank: ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ పెంచింది.
World Bank raises India GDP growth forecast to 7% for FY 2024 and 25

ఎకానమీ పురోగతి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం ఉంటుందన్న తొలి (జూన్‌ నివేదికలో) అంచనాలను తాజాగా 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ‘ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌’ నివేదికలో పేర్కొంది.

రుతుపవనాల మెరుగుదల, ప్రైవేట్‌ వినియోగం–ఎగుమతులు పెరిగే అవకాశాలు.. అంచనాల తాజా పెంపుదలకు తోడ్పడినట్లు ప్రపంచ బ్యాంక్‌ సీనియర్‌ ఆర్థికవేత్త రాన్‌లీ చెప్పారు. 

అవుట్‌లుక్‌ పాజిటివ్‌..
అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక అవుట్‌లుక్‌ ‘పాజిటివ్‌’గా ఉందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. 2024–25లో 7 శాతం వృద్ధి రేటు నమోదయితే, తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాలు (2025–26, 2026–27) ఎకానమీ పటిష్టంగా ఉంటుందని ఉద్ఘాటించింది.

GDP: 'జీడీపీ' అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా..?

Published date : 04 Sep 2024 04:07PM

Photo Stories