Skip to main content

Interest Rate: నాలుగేళ్ల తర్వాత.. తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు!!

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది.
US Federal Reserve Lowers Interest Rates for First Time in 4 Years

అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. 32 నెలల తదుపరి ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అధ్యక్షతన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్‌ తీసుకుంది.

ఆగస్ట్‌లో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్‌ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం కోవిడ్‌–19 కారణంగా 2000 మార్చిలో ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. 

2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడ్‌ 2023 జూలై తదుపరి నిలకడను కొనసాగిస్తూ వచ్చింది. 2000 డిసెంబర్‌లో 6.5 శాతానికి ఎగసిన ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు గతేడాది తిరిగి 5.5 శాతానికి చేరడంతో గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో యూఎస్‌ మార్కెట్లు 1% పైగా ఎగసి ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్‌ ధర 24 డాలర్లు పెరిగి 2,618 డాలర్ల ఆల్‌టైమ్‌ హైని చేరింది. 

GDP Growth: ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్

Published date : 19 Sep 2024 11:42AM

Photo Stories