Skip to main content

Top 10 Economies In the World : ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన టాప్ 10 దేశాలు ఇవే.. ఇందులో భార‌త్..?

2023లో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా 5 వ స్థానంలో చేరింది. భారతదేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Top 10 Economies In the World News in Telugu ,
Top 10 Economies In the World

గతంతో పోలిస్తే టెక్నాలజీ ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఒక దేశం GDPని అంచనా వేయడానికి మొత్తం వినియోగ వస్తువులు, కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతుల నికర విలువ ఉపయోగపడుతుంది. అయితే 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

☛ Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి జాబితాలో ఉంది. ఐదవ స్థానంలో భారత్ చేరగా.. 10వ స్థానంలో బ్రెజిల్ ఉంది.

2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాలు ఇవే..
1. అమెరికా - 26854 బిలియన్ డాలర్లు
2. చైనా - 19374 బిలియన్ డాలర్లు
3. జపాన్ - 4410 బిలియన్ డాలర్లు
4. జర్మనీ - 4309 బిలియన్ డాలర్లు
5. ఇండియా - 3750 బిలియన్ డాలర్లు
6. యూకే - 3159 బిలియన్ డాలర్లు
7. ఫ్రాన్స్ - 2924 బిలియన్ డాలర్లు
8. ఇటలీ - 2170 బిలియన్ డాలర్లు
9. కెనడా - 2090 బిలియన్ డాలర్లు
10. బ్రెజిల్ - 2080 బిలియన్ డాలర్లు

 

ప్రపంచంలోని టాప్ 10 దేశాల వారీగా జీడీపీ..

1. అమెరికా :

america economy and gdp 2023 news telugu

జీడీపీ: 26854 బిలియన్
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 80,030 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.6 శాతం

2. చైనా : 

china economy and gdp 2023

జీడీపీ: 19374 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 13,720 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.2 శాతం

☛ Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

3. జపాన్ : 
జీడీపీ: 4,410 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 35,390 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.3 శాతం

4. జర్మనీ : 
జీడీపీ: 4,309 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 51,380 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.1 శాతం

5. ఇండియా : 

india economy and gdp 2023

జీడీపీ: 3,750 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 2,601 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.9 శాతం

6. యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) : 
జీడీపీ: 3,159 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 46,370 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.3 శాతం

7. ఫ్రాన్స్ : 
జీడీపీ: 2,924 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 44,410 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం

8. ఇటలీ : 
జీడీపీ: 2,170 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 36,810 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం

9. కెనడా : 
జీడీపీ: 2,090 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 52,720 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.5 శాతం

10. బ్రెజిల్ : 
జీడీపీ: 2,080 బిలియన్ డాలర్లు
తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 9,670 డాలర్లు
వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.9 శాతం

☛ Andhra Pradesh Budget 2023‌-24 Highlights: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ 2023‌-24

Published date : 04 Sep 2023 08:47AM

Photo Stories