Skip to main content

Combat Air Pollution: హర్యానాలో వాయు కాలుష్య నివారణకు రూ.10,000 కోట్ల ప్రాజెక్ట్

వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు హర్యానా ప్రభుత్వం రూ.10,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించనున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలిపారు.
 Focus on NCR districts in the first phase    Rs.10000 Crore Project to Combat Air Pollution in Haryana   Haryana Clean Air Project for Sustainable Development

ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు సహాయం చేస్తాయి. హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనే ఈ ప్రాజెక్టు దశలవారీగా అమలు చేయబడుతుంది. మొదటి దశలో.. జాతీయ రాజధాని ప్రాంతం(NCR)లోని జిల్లాలపై దృష్టి పెడతారు.

ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు ఇవే..
➤ హర్యానాలోని వాయు నాణ్యత పర్యవేక్షణ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం.
➤ అత్యాధునిక ప్రయోగశాలలను స్థాపించడం, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించడం.
➤ వాయు నాణ్యత నిర్వహణలో పాల్గొనే వాటాదారులకు శిక్షణ ఇవ్వడం.
➤ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం. 

Anti Radiation Missile: యాంటీ రేడియేషన్‌ మిసైల్‌.. ‘రుద్ర ఎమ్‌-2’ పరీక్ష విజయవంతం

Published date : 07 Jun 2024 10:52AM

Photo Stories